
టారిఫ్ తగ్గించేలా చర్యలు తీసుకుంటాం
సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాం
విద్యుత్ రంగాన్ని దెబ్బతీసిన గత ప్రభుత్వం
శ్వేతపత్రం విడుదలలో సిఎం చంద్రబాబు నాయుడు
అమరావతి,జూలై9(ఇది నిజం): నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో పాటు, కోతలు లేకుండా, భారం పడకుండా విద్యుత్ సరపరా చేయడం ప్రభుత్వం ముందున్న సవాలని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ధ్వంసమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెడితేనే ఇది సాధ్యమని అననారు. భావితరాల భవిష్యత్‌ను గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు.
టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తామని, విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం సాయం తీసుకుంటామన్నారు. ససౌరవిద్యుత్‌కు అధిక ప్రోత్సాహం ఇస్తామని అన్నారు. వ్యవసాయ పంప్‌సెట్లకు స్మార్ట్ విూటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చాం. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నాం. విద్యుత్‌తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. విద్యుత్ సంస్కరణల వల్ల నా అధికారం పోయినా దేశం బాగుపడిరది. నేను తెచ్చిన సంస్కరణలు వైఎస్ హయాంలో కనిపించాయి. మా హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నాం. 2014`19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగింది. 2018`19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశాం. మా హయాంలో ట్రాన్స్‌కో, జెన్‌కోకు అవార్డులు వచ్చాయి. గత ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్ రంగంలో రూ.49,596 కోట్లు అప్పులు చేశారని అన్నారు. ట్రూఅప్, ఇంధన సర్‌ఛార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాలుగా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది. గృహ వినియోదారులపై 45శాతం ఛార్జీలు పెంచారు. ఛార్జీల పెంపుతో కోటీ 53 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 50 యూనిట్లు వాడిన పేదలపై వందశాతం ఛార్జీలు పెంచారు. టారిఫ్ ద్వారా రూ.16,699 కోట్లు, ట్రూ అప్ ద్వారా రూ.5,886 కోట్లు, ఇంధన ఛార్జీలు రూ.3,977 కోట్లు, ఎలక్టిస్రిటీ డ్యూటీ పేరుతో రూ.5,607 కోట్ల మేర వసూలు చేశారు. రూ.వేల కోట్ల రుణం తీసుకుని విద్యుత్ రంగంపై పెనుభారం వేశారు. ఐదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పు 79శాతం మేర పెరిగింది. కొన్ని సార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలపై భారం మోపాయి. కోర్టు ఆదేశంతో నిర్వహణ ఛార్జీలు రూ.9వేల కోట్లు చెల్లించారు. పవన విద్యుత్‌లో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారు.
అసమర్థ పాలనతో విద్యుత్ రంగం 47,741 కోట్లు నష్ట పోయింది. విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతాం. భవిష్యత్తులో ఈవీ వాహనాలు మరింత పెరుగుతాయి. ఈవీ వాహనాల డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాల్సి ఉందన్నారు. థర్మల్ విద్యుత్‌ను గ్రీన్ హైడ్రోజన్‌గా మార్చేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ వస్తే మనకు అదనంగా పన్నులు వస్తాయి. రూఫ్ టాప్ సౌరశక్తి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కమిటీ నిర్ణయిస్తుంది. విద్యుత్ సరఫరాలో నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యుత్ రంగం బలోపేతానికి సాంకేతిక సాయం తీసుకుంటాం. జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 4,773 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడిరది. సెకి నుంచి కొనుగోలు చేయాల్సిన 7వేల మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్సిమిషన్ కోసమే రూ.3,850 కోట్ల నుంచి 4,350 కోట్ల వరకు అదనంగా చెల్లింపులు చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఊహించని కోణాల్లో విద్యుత్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ బాండ్లలో.. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలు పెట్టుబడులు పెట్టాయంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని చంద్రబాబు వివరించారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com