చిత్తూరు న్యూస్:గ్రామీణ ప్రాంతాల్లో సి ఎస్ ఐ చర్చిలు ప్రారంభించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వేలూరు
సి ఎస్ ఐ డయాసిస్ బిషప్ రేవరెండ్ డాక్టర్ శర్మ నిత్యానందన్ అన్నారు చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని కాశిరాల పంచాయతీ పరిధిలోని గాంధీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీఎస్ఐ గుడ్ షెఫర్డ్ చర్చిని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థన చేసి ప్రారంభించారు .
ఈ సందర్భంగా బిషప్ కు గ్రామస్తులు క్రైస్తవ సోదరులు మత బోధకులు మేలా తలాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన చర్చిలో దేవుని యొక్క వాక్యాలను భక్తిశ్రద్ధలతో కీర్తించాలన్నారు. చర్చి నిర్మాణానికి కృషి చేసిన గ్రామస్తులకు దాతలకు ప్రత్యేక అభినందనలు తెలియ జేయడంతోపాటు బైబిల్ వసనాలను ఏసుక్రీస్తు నామముల గురించి వివరించారు. గాంధీ పురం గ్రామానికి తమకు విడదీయలేని బంధం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నంపల్లి ఫాస్ట్ రేట్ పాస్టర్ రెవరెండ్ ఆనంద్ , జెస్సి పౌలిన్, కార్యదర్శి కే మనోహర్ , కోశాధికారి జీడి బాబు, గాంధీ పురం ఉపదేశకులు నాగరాజు, సభమని సురేష్ బాబు, పీసీ మెంబర్ రాజా, వివిధ ప్రాంతాలకు చెందిన చర్చి పాస్టర్లు , ఫాస్ట్ రేట కార్యదర్శులు కోశాధికారులు, గ్రామ పెద్దలు క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com