
విల్లివాకం న్యూస్ : ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ (ఏఐటిఎఫ్), మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమిళనాడుమాజీ గవర్నర్ డాక్టర్ కె రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. డాక్టర్ రోశయ్య సుదీర్ఘ రాజకీయ జీవిత విజయానికి ఆమె మద్దతు మరియు ప్రోత్సాహం చాలావరకు కారణమయ్యాయి. 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె. చలమేశ్వర్ సమక్షంలో నెహ్రూ స్టేడియంలో జరిగిన మా 'ముప్పెరం విళా' సందర్భంగా ఆమెను సత్కరించే ఆనందం మాకు లభించింది.
ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మరియు ఆమెకు శాశ్వత శాంతిని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులుప్రొఫెసర్ సి.ఎం.కె.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com