గూడూరు: పెళ్లి ఆనందంలో మునిగిపోవాల్సిన ఓ యువతి, వివాహానికి ముందురోజే అదృశ్యమై, మరుసటి రోజు మృతదేహంగా కనిపించడం గూడూరు ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఏమైంది?
సూళ్లూరుపేట రాఘవయ్యపేటకు చెందిన లేహా నిస్సీ (19) గూడూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలో బీటెక్ (ECE) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి శ్యాముయేల్ జయకుమార్, అదే కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
వివాహానికి ముందురోజే అదృశ్యం
లేహా నిస్సీకి తన బంధువుతో వివాహం నిశ్చయమై, డిసెంబర్ 14న నిశ్చితార్థం కూడా జరిగింది. జనవరి 31న పెళ్లి జరగాల్సి ఉండగా, జనవరి 20న కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన నిస్సీ తిరిగి రాలేదు.
గూడూరు సమీపంలో మృతదేహం
పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు ఎక్కడా ఆచూకీ పొందలేకపోయారు. కానీ జనవరి 25న గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో ఆమె మృతదేహం లభ్యమైంది.
సూసైడ్ నోట్లో ఏముంది?
పోలీసులకు లభించిన లేఖలో, "చైతూ బావా.. నా కోసం ఏదైనా చేస్తానని అన్నావుగా.. నీకు పుట్టే బిడ్డకు నా పేరు పెట్టు.. మీ లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా హ్యాపీ.. కానీ మిమ్మల్ని వదిలి వెళుతున్నా.. సారీ" అంటూ భావోద్వేగపూరితంగా రాసింది.
పోలీసుల దర్యాప్తు
నిస్సీ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలేంటో తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యుల వాంగ్మూలాలు, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన గూడూరు ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com