
విల్లివాకం న్యూస్: చెన్నై, సీతారామ నగర్ తెలుగు సంక్షేమ సంఘానికి చెందిన దాసం కోటేశ్వరరావు శుక్రవారం తెల్లవారుజామున తన స్వగృహంలో
2:00 గంటల సమయంలో మృతి చెందారు. మృదుస్వభావి, స్నేహశీలిగా పేరుందిన ఆయన సంస్థ కార్యకలాపాలలో ఎంతగానో సహకరించేవారు. ఆయన మృతి పట్ల కార్యనిర్వాహకవర్గం సంతాపం ప్రకటించింది. వారి మృతి తీరని లోటని పేర్కొంది. ఆయన దూరమైనా ఆయన సేవలు, ఆయన జ్ఞాపకాలు మననుండి దూరం కాలేవని, కావున ఆయనగారి ఆత్మశాంతికై మనమందరమూ ఆ భగవంతుని ప్రార్ధిద్దామని తెలిపారు. ఆయన అంత్యక్రియలు శనివారం 25/01/2025 ఉదయం 11.00 గంటల ప్రాంతంలో చెన్నైలోని ఆయన స్వగృహం వద్ద జరుగనున్నట్లు కుటుంబ సభ్యులు ,బంధుమిత్రులు తెలిపారు.
………………