విల్లివాకం న్యూస్: శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చెన్నై టి.నగర్ లో గల తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆలయ ప్రాంగణంలో భక్తి గీతాలతో నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి, ఏఈఓ పార్థసారథి, గౌరవ అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కె. అనిల్ కుమార్ రెడ్డి, ప్రత్యేక అతిథిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపి విచ్చేసారు.
ముందుగా అతిధులను నిర్వాహకులు సత్కరించారు. అలాగే, ఇందులో శ్రీ భారత్ కళ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్, గురు నృత్యకారిణి రోజా రాణి, డైరెక్టర్, ఆర్గనైజర్ దుర్గా నటరాజ్, సపోర్టింగ్ డైరెక్టర్ ప్రణతి రెడ్డి, శ్రీ విశ్వ కామాక్షి కళాలయ గురు డాక్టర్ నీరజ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఇందులో విద్యార్థినులు ఆర్ రాజేశ్వరి, ఎస్ క్రిష్నిత, ఆర్ లక్ష్య, నేత్ర ప్రసన్నకుమార్ తదితరుల నృత్య రీతులు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి అనేకమంది హాజరయ్యారు. విద్యార్థినులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com