విల్లివాకం న్యూస్: కొరట్టూర్ కండిగై వీధిలోని 'వే టు ట్రూ లైఫ్ మినిస్ట్రీస్ (సత్య జీవ మార్గము మినిస్ట్రీస్)' చర్చిలో సంఘ కాపరి రెవరెండ్ పొదిలి మెల్కిసెదక్ అధ్యక్షతన 'క్రిస్మస్' ఆరాధన జరిగినది. ఈ ఆరాధనలో సంఘస్తులందరూ తమ కుటుంబ సభ్యులతో కలసి మహోన్నత దేవుని అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు జన్మదినమును ఆనందోత్సాహములతో జరుపుకున్నారు. పాస్టర్ రెవ. పి.మెల్కిసెదక్ పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని 'దేవుని వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను'అను ఆత్మీయ సందేశము అందించారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com