Logo
Date of Publish : 12 July 2026, 5:01 pm
Editor : CH. MUKUNDARAO

ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ముంబయి న్యూస్: కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో పరామర్శించారు.

కొద్దిసేపటి క్రితం ముంబయిలోని ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, వైద్యుల సూచనలను పాటిస్తూ పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.


All Rights Reserved By telugunewstimes
Print Save