రాష్ట్రీయం – telugu news times https://telugunewstimes.com తెలుగు న్యూస్ టైమ్స్ Mon, 23 Feb 2026 12:58:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://telugunewstimes.com/wp-content/uploads/2024/08/cropped-tnt-1-32x32.jpg రాష్ట్రీయం – telugu news times https://telugunewstimes.com 32 32 తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల https://telugunewstimes.com/tamil-nadu-final-voter-list-released/ https://telugunewstimes.com/tamil-nadu-final-voter-list-released/#respond Mon, 23 Feb 2026 12:57:58 +0000 https://telugunewstimes.com/?p=5561 చెన్నై: తమిళనాడులో భారత ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియ పూర్తికాగా, తుది ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ వివరాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.67 కోట్లకు చేరింది.
తాజా గణాంకాల ప్రకారం 2,77,38,925 మంది పురుషులు, 2,89,60,838 మంది మహిళలు, 7,617 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షలకు పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగించబడినట్లు అధికారులు తెలిపారు. గతంలో 6.41 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం తగ్గి 5.67 కోట్లకు చేరింది.
2025 నవంబర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం 2025 డిసెంబర్ 19న విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాలో సుమారు 5.43 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను 2026 జనవరి 30 వరకు స్వీకరించి పరిశీలించిన అనంతరం 27,53,796 మంది కొత్త ఓటర్లను తుది జాబితాలో చేర్చారు.
సవరణలో భాగంగా 97 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. వీరిలో సుమారు 26.94 లక్షల మంది మరణించినవారు కాగా, 66.44 లక్షల మంది ఇతర ప్రాంతాలకు మారినవారిగా గుర్తించారు. మరో 3.39 లక్షల మంది బహుళ ప్రాంతాల్లో నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
తుది జాబితా ప్రకారం చెంగల్పట్టు జిల్లాలోని షోలింగనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 5,36,991 మంది ఓటర్లు నమోదయ్యారు. ఇక చెన్నైలోని హార్బర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,16,896 మంది ఓటర్లు ఉన్నారు.
రాబోయే 2026 వేసవి కాలంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా ఓటర్ల జాబితా కీలకంగా మారింది.
తుది గణాంకాలు:
మొత్తం ఓటర్లు: 5.67 కోట్లు
పురుషులు: 2.77 కోట్లు
మహిళలు: 2.89 కోట్లు
థర్డ్ జెండర్ ఓటర్లు: 7,617 మంది
………….

]]>
https://telugunewstimes.com/tamil-nadu-final-voter-list-released/feed/ 0
ఒత్తిడులకు లొంగను: విజయ్ https://telugunewstimes.com/i-will-not-succumb-to-pressure-vijay/ https://telugunewstimes.com/i-will-not-succumb-to-pressure-vijay/#respond Sun, 25 Jan 2026 09:03:31 +0000 https://telugunewstimes.com/?p=5413 చెన్నై న్యూస్:తవేకా కార్యకర్తల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కీలక దశలో ఉందని పేర్కొన్న ఆయన, తమపై ఎలాంటి ఒత్తిడులు పనిచేయవని స్పష్టం చేశారు.
“నాపై ఒత్తిడి ఉందా అని అడిగితే — ఉంది. కానీ అది నా కోసం కాదు, ప్రజల కోసం. మార్పులు ఆశించిన ప్రజలు మోసపోయి ఒత్తిడిలో ఉన్నారు” అని విజయ్ అన్నారు.
తాను ఎప్పటికీ అవినీతికి పాల్పడనని, ఒక్క రూపాయి కూడా అక్రమంగా తీసుకునే అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. “అవినీతికి చుక్కంత స్థానం కూడా ఉండదు. ప్రజలే నా బలం” అని చెప్పారు.
రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, అన్నాడీఎంకే బీజేపీకి పూర్తిగా లొంగిపోయిందని ఆరోపించారు. డీఎంకేను ప్రజలకు హానికరమైన శక్తిగా అభివర్ణించారు.
తవేకా కార్యకర్తలు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని సూచించారు.
“ఎవరైనా తప్పు చేస్తే, వారు ఎవరైనా సరే — తప్పించుకునే అవకాశం ఉండకూడదనే భయం ఉండాలి. పార్టీ అంతా ఐక్యంగా ప్రజల కోసం పనిచేయాలి” అని విజయ్ పిలుపునిచ్చారు. అనంతరం టీవీ కె ఎన్నికల గుర్తు అయిన’ విజిల్ ‘ను పరిచయం చేసి ఆవిష్కరించి కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
………

]]>
https://telugunewstimes.com/i-will-not-succumb-to-pressure-vijay/feed/ 0
మహిళలకు రూ.2,000, పురుషులకు ఉచిత బస్సు – ఏఐడీఎంకే కీలక హామీలు https://telugunewstimes.com/rs-2000-for-women-and-free-bus-travel-for-men-aiadmks-key-promises/ https://telugunewstimes.com/rs-2000-for-women-and-free-bus-travel-for-men-aiadmks-key-promises/#respond Sat, 17 Jan 2026 09:55:45 +0000 https://telugunewstimes.com/?p=5374 చెన్నై న్యూస్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఏఐడీఎంకే (AIADMK) తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో నివాళులు అర్పించిన అనంతరం, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రజలను ఆకట్టుకునేలా ఐదు ప్రధాన ఎన్నికల హామీలను ప్రకటించారు.
మేనిఫెస్టో కమిటీ నివేదికకు ముందే ప్రజల్లోకి బలమైన సందేశం పంపాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయాలను వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
🚍 పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
ప్రస్తుతం మహిళలకు అమలులో ఉన్న ఉచిత సిటీ బస్సు ప్రయాణ పథకాన్ని పురుషులకు కూడా వర్తింపజేస్తామని పళనిస్వామి ప్రకటించారు. దీనివల్ల రోజువారీ ప్రయాణ ఖర్చులు తగ్గి, సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
💰 మహిళలకు నెలకు రూ.2,000
‘మగళీర్ కులవిళక్కు’ పథకం కింద ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ.2,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.
🏠 పేదలకు ఇళ్లు – గ్రామాల్లో స్థలం, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు
గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి కాంక్రీట్ ఇళ్లు నిర్మిస్తామని, పట్టణాల్లో బహుళ అంతస్తుల నివాస సముదాయాలను నిర్మించి నిరుపేదలకు కేటాయిస్తామని తెలిపారు. అలాగే ఎస్సీ వర్గాల్లో కొత్తగా వివాహం చేసుకున్న జంటలకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
🚜 ఉపాధి హామీ 150 రోజులు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని పళనిస్వామి వెల్లడించారు.
🛵 అమ్మ టూ వీలర్ స్కీమ్
‘అమ్మ టూ వీలర్’ పథకం కింద 5 లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ.25,000 సబ్సిడీ అందిస్తామని ప్రకటించారు.
⚔ డీఎంకేపై విమర్శలు
ఇన్ని పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో సాధ్యమా అన్న మీడియా ప్రశ్నలకు స్పందించిన పళనిస్వామి, డీఎంకే ప్రభుత్వానికి పరిపాలనా సామర్థ్యం లేదని విమర్శించారు. తమ పాలనలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపామని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో తాము ప్రతిపాదించిన పథకాలనే డీఎంకే కాపీ చేసిందని, ఇప్పుడు వాటికన్నా మెరుగైన హామీలతో ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు.
మేనిఫెస్టో కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని కీలక పథకాలు ప్రకటిస్తామని పళనిస్వామి స్పష్టం చేశారు.
…………

]]>
https://telugunewstimes.com/rs-2000-for-women-and-free-bus-travel-for-men-aiadmks-key-promises/feed/ 0
అక్బర్ అలీ కమిటీ నివేదికను వెంటనే సమర్పించాలి! ఎస్ సి/ఎస్ టి ఫెడరేషన్ డిమాండ్ https://telugunewstimes.com/the-akbar-ali-committee-report-must-be-submitted-immediately-sc-st-federation-demand/ https://telugunewstimes.com/the-akbar-ali-committee-report-must-be-submitted-immediately-sc-st-federation-demand/#respond Wed, 14 Jan 2026 18:03:57 +0000 https://telugunewstimes.com/?p=5336 విళ్లివాకం న్యూస్ : తమిళనాడులో ఎస్ సి/ఎస్ టి ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివక్షను పరిష్కరించడానికి జస్టిస్ (రిటైర్డ్) జీఎం అక్బర్ అలీ నేతృత్వంలోని రిజర్వేషన్ విధానాలపై కమిటీ నివేదికను వెంటనే సమర్పించాలని అఖిల భారత ఎస్ సి/ఎస్ టి సంఘాల సమాఖ్య కోరింది. జనవరి 13, 2026న మద్రాస్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే తుది నివేదికను సమర్పించాలని తీర్మానం ఆమోదించబడింది. అప్పుడే తమిళనాడు ప్రభుత్వం రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ విషయంలో చట్టం చేసి, సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేస్తుంది.
దీనిని సరిగ్గా అనుసరించవచ్చని తెలియజేయబడింది. ఈ కార్యక్రమంలో సమాఖ్య ముఖ్య సలహాదారు డాక్టర్ రాజ్‌కుమార్ ఐఏఎస్ (రిటైర్డ్), రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్. కరుప్పయ్య మరియు
జనరల్ సెక్రటరీ డాక్టర్ మరియు ఎస్. తమిళ్ సెల్వం నేతృత్వంలోని బృందం, ఇన్‌చార్జ్‌లు జనార్ధనన్ మరియు సహదేవన్ పాల్గొన్నారు. రాష్ట్ర ఇరునయనాథన్ మరియు సతీష్ బాబు కూడా హాజరయ్యారు.

 

]]>
https://telugunewstimes.com/the-akbar-ali-committee-report-must-be-submitted-immediately-sc-st-federation-demand/feed/ 0
అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాలు సాధిస్తాం! : స్టాలిన్ ధీమా https://telugunewstimes.com/we-will-win-200-seats-in-the-assembly-elections-stalins-confident-assertion/ https://telugunewstimes.com/we-will-win-200-seats-in-the-assembly-elections-stalins-confident-assertion/#respond Sat, 10 Jan 2026 17:43:47 +0000 https://telugunewstimes.com/?p=5262 విళ్లివాకం న్యూస్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాలు సాధిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్యలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాలకు గాను తమ పార్టీ నేతృత్వంలోని కూటమి 200 నియోజకవర్గాలకు పైగా విజయం సాధిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. శనివారం జరిగిన ‘పొంగల్’ పండుగ కార్యక్రమంలో ప్రసంగిస్తూ స్టాలిన్, వివిధ పార్టీలకు చెందిన ప్రజలు, చివరికి బీజేపీలో ఉన్నవారు కూడా డీఎంకే కార్యకర్తల్లా ఎవరూ పనిచేయలేరని అంటున్నారని అన్నారు. 1967లో పార్టీ వ్యవస్థాపకుడు సి.ఎన్. అన్నాదురై నాయకత్వంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం. భక్తవత్సలం డీఎంకే కార్యకర్తల పనితీరు గురించి మాట్లాడారు.
1963 మరియు 1967 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు, ఒక డీఎంకే కార్యకర్త ఒక కప్పు టీ మాత్రమే తాగి అలసిపోకుండా పని చేస్తాడని, అలాంటి నిబద్ధతకు సాటి లేదని అన్నారు. ఈ రోజు కూడా కార్యకర్తలకు అదే స్థాయి నిబద్ధత ఉందని స్టాలిన్ అన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, తన పార్టీ నేతృత్వంలోని కూటమి 200 కంటే తక్కువ స్థానాలను గెలుచుకోదని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వం చేసిన పటిష్టమైన పనిని దృష్టిలో ఉంచుకుని, డీఎంకే నేతృత్వంలోని కూటమి 200 నియోజకవర్గాలను కూడా అధిగమిస్తుందనే నమ్మకం తనకు కలిగిందని స్టాలిన్ అన్నారు.
ఆ నమ్మకంతోనే మనం పొంగల్ పండుగను జరుపుకుంటున్నాము. ఈ పొంగల్ పండుగను జరుపుకుంటున్న ఈ సమయంలో, మీ అందరికీ నా పొంగల్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మరియు రాబోయే ఎన్నికలలో భారీ విజయాన్ని సాధిస్తామని మనం సంకల్పం తీసుకుందాం మరియు ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు.
……………..

]]>
https://telugunewstimes.com/we-will-win-200-seats-in-the-assembly-elections-stalins-confident-assertion/feed/ 0
జననాయగన్ వివాదం : విజయ్ కు అండగా స్టాలిన్ https://telugunewstimes.com/jananayagan-controversy-stalin-supports-vijay/ https://telugunewstimes.com/jananayagan-controversy-stalin-supports-vijay/#respond Sat, 10 Jan 2026 16:09:54 +0000 https://telugunewstimes.com/?p=5258 విల్లివాకం న్యూస్: విజయ్ రాజకీయ ప్రవేశ నేపథ్యంలో ‘జన నాయగన్’ సినిమాపై ఏర్పడిన వివాదం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. శుక్రవారం వరకు విజయ్ సినిమాను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్న ఆరోపణలు వస్తుండగా ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగి కేంద్రంపై విమర్శలు గుప్పించడంతో సంచలనం ఏర్పడింది. తమిళ చలనచిత్ర రంగంలో విజయ్ అగ్ర నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టివికె) స్థాపించిన తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్‌లో ఎదురవుతున్న అడ్డంకులు ఇప్పుడు రాజకీయ అద్దుకున్నాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ వివాదంలో తలదూర్చడమే కాకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం తమిళనాట చర్చనీయాంశమైంది.
ఇప్పటివరకు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ విజయ్ ఎదుగుదలను డీఎంకే (డిఎంకే) అడ్డుకుంటోందనే ప్రచారం జరిగింది. విజయ్ తన పార్టీ ప్రసంగాల్లో డీఎంకేను కూడా విమర్శించడంతో, ప్రభుత్వం ఆయన సినిమాకు ఇబ్బందులు సృష్టిస్తోందని అందరూ భావించారు. కానీ, సీఎం స్టాలిన్ అనూహ్యంగా సెన్సార్ బోర్డు (సీబీఎఫ్ సి) తీరును తప్పుబట్టడం ద్వారా ఆ విమర్శలకు చెక్ పడింది. సెన్సార్ బోర్డును కేంద్రం కీలుబొమ్మగా మార్చుకుందనీ, ఈడీ, సీబీఐ మాదిరిగానే సీబీఎఫ్‌సీని కూడా ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుతోందని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో నెట్టాయి.
……….

]]>
https://telugunewstimes.com/jananayagan-controversy-stalin-supports-vijay/feed/ 0
తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్ ఆర్.ఎన్. రవి విమర్శలు https://telugunewstimes.com/governor-r-n-ravi-criticized-the-tamil-nadu-government/ https://telugunewstimes.com/governor-r-n-ravi-criticized-the-tamil-nadu-government/#respond Thu, 08 Jan 2026 15:53:34 +0000 https://telugunewstimes.com/?p=5218 విళ్లివాకం న్యూస్: తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, తిరుప్పరంకుండ్రంలో కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అడ్డుకుంటున్నారని గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆరోపించారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఆచారానికి అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ‘స్పష్టంగా ఉల్లంఘించారని’ గవర్నర్ ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిరోధించడానికి తన సర్వశక్తులను ఒడ్డుతోంది’ అని ఆయన పేర్కొంటూ, 75 ఏళ్ల దేశ చరిత్రలో న్యాయవ్యవస్థను ఈ విధంగా ధిక్కరించడం అపూర్వమని అన్నారు. ఈ విషయంపై తీర్పు ఇచ్చినందుకు న్యాయమూర్తి జి.ఆర్. స్వామినాథన్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ, న్యాయమూర్తిని బెదిరించారని కూడా గవర్నర్ రవి ఆరోపించారు.

]]>
https://telugunewstimes.com/governor-r-n-ravi-criticized-the-tamil-nadu-government/feed/ 0
2026లో ఒంటరిగానే పోటీకి TVK – సీఎం అభ్యర్థిగా విజయ్ https://telugunewstimes.com/tvk-to-contest-alone-in-2026-vijay-as-cm-candidate/ https://telugunewstimes.com/tvk-to-contest-alone-in-2026-vijay-as-cm-candidate/#respond Thu, 06 Nov 2025 04:40:57 +0000 https://telugunewstimes.com/?p=4891 చెన్నై న్యూస్: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్ ప్రకటించారు. బుధవారం (నవంబర్ 5) మామల్లపురంలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదే సమావేశంలో పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 2,000 మంది జనరల్ కౌన్సిల్ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, పార్టీ నేతలు హాజరయ్యారు.

సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన ర్యాలీలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి స్మారకంగా సమావేశం ప్రారంభంలో రెండు నిమిషాల మౌనం పాటించారు. ఆ ఘటనల నేపథ్యంలో భవిష్యత్తులో మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది.

సమావేశంలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించారు. వీటిలో ముఖ్యంగా ఓటర్ల జాబితాలపై జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ ప్రక్రియ అర్హత కలిగిన ఓటర్లను తొలగించే ప్రమాదం ఉందని పార్టీ ఆరోపించింది.

అలాగే శ్రీలంక నావికాదళం తమిళనాడు మత్స్యకారులను తరచుగా అరెస్ట్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించలేదని టీవీకే మండిపడింది.

రాష్ట్రంలో శాంతిభద్రతలు బలహీనమయ్యాయని, కోయంబత్తూరు కాలేజీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన దీనికి నిదర్శనమని పార్టీ పేర్కొంది.

డెల్టా రైతుల సమస్యలపై కూడా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ధాన్యం సేకరణలో జాప్యం, భూముల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని టీవీకే విమర్శించింది.

విజయ్ నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య మార్పుకు పునాది వేయాలని పార్టీ కేడర్ ఉత్సాహంగా పేర్కొన్నారు.

]]>
https://telugunewstimes.com/tvk-to-contest-alone-in-2026-vijay-as-cm-candidate/feed/ 0
10+1 డీల్: ప్రేమలత స్టాలిన్‌కు ఓకే.. ఎడప్పాడికి షాక్!” https://telugunewstimes.com/101-deal-premalatha-stalin-oks-it-edappadi-is-shocked/ https://telugunewstimes.com/101-deal-premalatha-stalin-oks-it-edappadi-is-shocked/#respond Thu, 07 Aug 2025 07:41:40 +0000 https://telugunewstimes.com/?p=4668 టి నగర్ న్యూస్:2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, సంకీర్ణ చర్చలు వేడెక్కుతున్నాయి. అన్నాడీఎంకే కూటమి నుంచి డీఎండీకే దాదాపుగా బయటకు వెళ్లిపోయింది. డీఎంకే వైపు పొత్తు చర్చలు కొనసాగుతున్నాయి. డీఎంకే 2026 ఎన్నికల్లో డీఎండీకేకు ఒక రాజ్యసభ సీటు, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించనున్నట్లు సమాచారం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, విజయకాంత్ ఉన్నంత కాలం డీఎండీకే డీఎంకేతో పొత్తు పెట్టుకోలేదు.

ఈ ఎన్నికలు ఇద్దరు కీలక నాయకులకు చాలా ప్రాముఖ్యమైనవి.

ఎడప్పాడి పళనిస్వామి: వరుస పరాజయాలపై వస్తున్న విమర్శలకు ముగింపు పలకాలని చూస్తున్నారు.

ఎంకే స్టాలిన్: వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చురుకుగా చర్యలు తీసుకుంటున్నారు.

ఏఐఏడిఎంకే-డీఎంకే కూటముల స్థితి:
తమిళనాడు రాజకీయాల్లో, కూటమి పార్టీలు లేకుండా విజయాన్ని సాధించడం రెండు ప్రధాన పార్టీలకు అసాధ్యమే. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, విదుతలై సిరుతైగల్, కమ్యూనిస్టు పార్టీలు, మణితనయ మక్కల్ కట్చి, ముస్లిం లీగ్ తదితరులు కొనసాగుతున్నారు.

ఏఐఏడిఎంకె వైపు పరిస్థితి:
బిజెపితో పొత్తు ఉన్నప్పటికీ, జీకే వాసన్ (తమిళ మానయ కాంగ్రెస్), పరివేందర్ (ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ), జనపాండియన్ (మక్కల్ మున్నేట్ర కజగం), కృష్ణసామి (పుథియ తమిళనాడు) వంటి పార్టీలు చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

డీఎండీకే పరిస్థితి:
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె-డిఎండికె పొత్తు ఉంది. అయితే, రాజ్యసభ టికెట్ విషయంలో విభేదాలు తలెత్తాయి. ఎడప్పాడి అంగీకరించకపోవడంతో, ప్రేమలత విజయకాంత్ కూటమి నుంచి దాదాపుగా వైదొలిగారు.

ఇటీవల డీఎంకేతో పరోక్ష చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ప్రేమలత స్వయంగా కలవడం ఇందుకు నిదర్శనం. డీఎంకే 10 అసెంబ్లీ స్థానాలతో పాటు రాజ్యసభ టికెట్ హామీ ఇచ్చినట్లు సమాచారం. విజయకాంత్ గతంలో ఎప్పుడూ డీఎంకేతో పొత్తు పెట్టుకోకపోయినా, ఇప్పుడు పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది.

]]>
https://telugunewstimes.com/101-deal-premalatha-stalin-oks-it-edappadi-is-shocked/feed/ 0
తమిళనాడులో ఆర్థిక సంక్షోభమా? చెన్నై హైకోర్టు ప్రశ్న https://telugunewstimes.com/is-there-an-economic-crisis-in-tamil-nadu-chennai-high-court-questions/ https://telugunewstimes.com/is-there-an-economic-crisis-in-tamil-nadu-chennai-high-court-questions/#respond Tue, 24 Jun 2025 10:05:07 +0000 https://telugunewstimes.com/?p=4551 టి నగర్ న్యూస్: తమిళనాడులో ప్రజా పంపిణీ పథకం కింద రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేయాల్సిన వంట నూనె కొనుగోలుకు టెండర్ ఆహ్వానించబడింది. ఇందులో పాల్గొన్న KTV హెల్త్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వంట నూనెను సరఫరా చేసింది. టెండర్ షరతుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ. 141.22 కోట్లను 30 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంది.

ఇంతవరకు ప్రభుత్వం చెల్లించకపోవడంతో, ఈ బకాయిని చెల్లించేలా కోర్టు ఆదేశించాలని కోరుతూ కంపెనీ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ముందు విచారణకు వచ్చింది.

విచారణలో, ఇప్పటికే రూ. 200 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉందని, అయినా కొత్త టెండర్ ప్రక్రియలో ప్రభుత్వం నిమగ్నమైందని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, “గత రెండు వారాలుగా పదవీ విరమణ ప్రయోజనాలు కూడా చెల్లించట్లేదని కోర్టులకు పిటిషన్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిర్వహణకు తగిన తీరా?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

“చెల్లించాల్సిన మొత్తాలను ఎరిగి కూడా చెల్లించకపోవడంలో ఏదైనా ఉద్దేశముందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగానా?” అని వ్యాఖ్యానించి, “ఇది సరైన పాలన కాకపోవచ్చు” అని హితవు చెప్పారు.

అంతటితో పాటు, ఈ బకాయిని చెల్లించాలనే అంశంపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకురావాలని ఆదేశించి, తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేశారు.

]]>
https://telugunewstimes.com/is-there-an-economic-crisis-in-tamil-nadu-chennai-high-court-questions/feed/ 0