అంతర్జాతీయం – telugu news times https://telugunewstimes.com తెలుగు న్యూస్ టైమ్స్ Thu, 12 Jun 2025 09:54:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://telugunewstimes.com/wp-content/uploads/2024/08/cropped-tnt-1-32x32.jpg అంతర్జాతీయం – telugu news times https://telugunewstimes.com 32 32 గుజరాత్‌లో విమాన ప్రమాదం – ప్రయాణికుల పరిస్థితి అనిశ్చితం https://telugunewstimes.com/plane-crash-in-gujarat-passengers/ https://telugunewstimes.com/plane-crash-in-gujarat-passengers/#respond Thu, 12 Jun 2025 09:54:17 +0000 https://telugunewstimes.com/?p=4529 చెన్నై న్యూస్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 1.17 గంటలకు లండన్‌కు బయలుదేరిన ఓ ప్రైవేట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని నివాస ప్రాంతంలో జరిగింది.

విమానంలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత విమానం మంటల్లో చిక్కుకొని చుట్టుపక్కల ప్రాంతమంతా నల్లటి పొగతో కమ్ముకున్నది. అగ్నిమాపక, పోలీసు బృందాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. స్థానికులూ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ, ఇతర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.

]]>
https://telugunewstimes.com/plane-crash-in-gujarat-passengers/feed/ 0
భారత్ మెరుపుదాడులు: ఉగ్ర స్థావరాలపై చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న దృశ్యం https://telugunewstimes.com/tensions-are-rising-with-actions-against-terrorist-camps/ https://telugunewstimes.com/tensions-are-rising-with-actions-against-terrorist-camps/#respond Wed, 07 May 2025 05:37:26 +0000 https://telugunewstimes.com/?p=4413 న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదిరాయి. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంటూ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు జరిపింది. ఈ దాడుల గురించి భారత అధికారులు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలకు అధికారిక సమాచారం అందించారు. దాడులకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాక్ సైన్యం, ప్రభుత్వం స్పందన

ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. బహవల్పూర్‌, కొట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో పాక్ ప్రకారం ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, మృతుల సంఖ్య పదికిపైగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్‌కు తగిన ప్రతీకారం తప్పదు అంటూ పాక్‌ సైన్యం హెచ్చరించింది. తాత్కాలిక విజయాలతో మురిసిపోవద్దని, దీని ఫలితాలు భారత్‌కు తీవ్రంగా ఉండేలా చేస్తామని పేర్కొంది.

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, “భారత్‌ మోసపూరితంగా ఐదు ప్రదేశాలపై దాడి చేసింది. ఇది ఒక యుద్ధ ప్రకటన లాంటిదే. ఈ చర్యకు పాక్ తగిన బలమైన ప్రతిస్పందన ఇస్తుంది. దేశం అంతా సాయుధ దళాల వెనుక నిలుస్తుంది,” అని తెలిపారు.

అమెరికా ప్రతిస్పందన

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో, భారత్-పాక్ మధ్య అభివృద్ధి చెందుతున్న పరిస్థితులపై ఉత్కంఠతో గమనిస్తున్నామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “ఇరు దేశాల మధ్య వివాదం అత్యంత ఆందోళనకరం. decadesుగా ఈ రెండు దేశాలు ఘర్షణలోనే ఉన్నాయి. ఇలాంటి ఘర్షణలు ప్రపంచానికి శాంతి కాంక్షించే తరుణంలో హేయం. ఇరు దేశాలు శాంతి దిశగా చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.

]]>
https://telugunewstimes.com/tensions-are-rising-with-actions-against-terrorist-camps/feed/ 0
తమిళ మత్స్యకారులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ https://telugunewstimes.com/pawan-kalyan-in-support-of-tamil-fishermen/ https://telugunewstimes.com/pawan-kalyan-in-support-of-tamil-fishermen/#respond Mon, 05 May 2025 11:28:17 +0000 https://telugunewstimes.com/?p=4409 – శ్రీలంక చర్యలపై తీవ్రంగా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం

చెన్నై: ఇటీవల బంగాళాఖాతంలో చోటుచేసుకున్న ఘటనా సమాహారంలో, శ్రీలంక నౌకాదళం 24 మంది తమిళనాడు మత్స్యకారులపై దాడికి దిగిన ఘటన తీవ్ర స్థాయిలో ఖండనకు గురవుతోంది. ఈ విషయమై పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతును వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “బంగాళాఖాతంలో 5 వేర్వేరు ఘటనల్లో తమిళనాడు మత్స్యకారులపై జరిగిన దాడులు తీవ్రమైన విషయాలు. ఇది మానవహక్కుల ఉల్లంఘన. అలాంటి అమాయక మత్స్యకారులపై దాడి చేయడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి” అని పవన్ తన X (హెచ్‌టీ ట్విట్టర్లో డిమాండ్ చేశారు.

]]>
https://telugunewstimes.com/pawan-kalyan-in-support-of-tamil-fishermen/feed/ 0
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన https://telugunewstimes.com/pope-francis-is-no-more-vatican-official/ https://telugunewstimes.com/pope-francis-is-no-more-vatican-official/#respond Mon, 21 Apr 2025 08:42:13 +0000 https://telugunewstimes.com/?p=4369 కేథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక నాయకుడు, పోప్ ఫ్రాన్సిస్ (వయసు 88) ఈరోజు ఉదయం మరణించినట్టు వాటికన్ అధికారులు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, వాటికన్ నగరంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం.

ఈరోజు సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఆయన మరణించినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రకటనను కూడా వాటికన్ విడుదల చేసింది.

అర్జెంటీనాలో 1936 డిసెంబర్ 17న జన్మించిన జార్జ్ మారియో బెర్గొగ్లియో, 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. తన సేవా కాలంలో సానుభూతితో కూడిన నాయకత్వానికి, సామాజిక న్యాయం పట్ల గల నిబద్ధతకు ఆయన ప్రసిద్ధి చెందారు.

తాజాగా నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొనడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన తక్కువగా ఉన్నా, ఈ రోజు ఉదయం వచ్చిన వార్త ఆందోళనకరంగా మారింది. కేథలిక్ విశ్వాసులందరికీ ఇది ఒక శోక సంఘటనగా మారింది.

]]>
https://telugunewstimes.com/pope-francis-is-no-more-vatican-official/feed/ 0
“మొఘలులకు, బ్రిటిష్ వారికి సవాలు చేసిన వీర యోధుడు! https://telugunewstimes.com/a-brave-warrior-who-challenged-the-mughals-and-the-british/ https://telugunewstimes.com/a-brave-warrior-who-challenged-the-mughals-and-the-british/#respond Wed, 19 Feb 2025 07:08:59 +0000 https://telugunewstimes.com/?p=4114 ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ”

చెన్నై న్యూస్ :మొఘలులను మరియు బ్రిటిష్ వారిని సవాలు చేసి హిందవి స్వరాజ్య స్థాపనకు మార్గదర్శకుడైన మహానాయకుడు ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. శివాజీ మహారాజ్ పరిపాలన దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు.

తన ఎక్స్-సాలా (మాజీ ట్విట్టర్) పోస్ట్‌లో ప్రధాని మోదీ, “ఛత్రపతి శివాజీ ధైర్యం, దార్శనికత భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన ఆదర్శాలు స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరకాలం గుర్తుండేలా మనం పాటించాలి” అని పేర్కొన్నారు.

శివాజీ మహారాజ్ తన సాహసంతో, వ్యూహాలతో మొఘలులకు ప్రతిఘటన ఇచ్చి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనకు బలమైన పునాది వేసిన మహానాయకుడు. ఈరోజు, ఆయన జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, నివాళి సభలు నిర్వహించబడుతున్నాయి.

]]>
https://telugunewstimes.com/a-brave-warrior-who-challenged-the-mughals-and-the-british/feed/ 0
ఫెంచల్ తుపాను ప్రభావం తగ్గింది: చెన్నై విమాన సర్వీసులు పునరుద్ధరణ https://telugunewstimes.com/impact-of-cyclone-fenchal-has-reduced-chennai-flights/ https://telugunewstimes.com/impact-of-cyclone-fenchal-has-reduced-chennai-flights/#respond Sun, 01 Dec 2024 01:38:06 +0000 https://telugunewstimes.com/?p=3588 ఫెంచల్ తుపాను కారణంగా చెన్నై నగరం భారీ వర్షాలు, ఈదురు గాలులతో తల్లడిల్లింది. తుపాను మామల్లపురం-పుదుచ్చేరి మధ్య అర్థరాత్రి తీరం దాటిన తర్వాత వర్షపాతం క్రమంగా తగ్గుముఖం పట్టింది.

నిన్న ఉదయం నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విమానాశ్రయ అధికారులు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడడంతో ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు సేవలు పునరుద్ధరించనున్నట్లు ప్రాథమికంగా ప్రకటించారు.

అయితే తుపాను తీరం దాటిన తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ముందుగానే, తెల్లవారుజామున 1 గంటకు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. దాదాపు 13 గంటల విరామం తర్వాత విమానాలు సజావుగా నడుస్తున్నాయి.

తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. వాతావరణ శాఖ చెన్నై, పరిసర ప్రాంతాల్లో వర్షపాతం మరింత తగ్గుతుందని పేర్కొంది.

]]>
https://telugunewstimes.com/impact-of-cyclone-fenchal-has-reduced-chennai-flights/feed/ 0
అమెరికాలో మరో ఉద్యమం! పురుషులతో శృంగారానికి నో అంటున్న మహిళలు https://telugunewstimes.com/another-movement-in-america-women-who-say-no-to-sex-with-men/ https://telugunewstimes.com/another-movement-in-america-women-who-say-no-to-sex-with-men/#respond Sat, 09 Nov 2024 15:04:01 +0000 https://telugunewstimes.com/?p=3303 2024 అమెరికా ఎన్నికల్లో గెలుపుతో డొనాల్డ్​ ట్రంప్​ సంతోషంగా ఉన్నా, ఆ ఫలితాలు చాలా మంది మహిళలకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి! డొనాల్డ్​ ట్రంప్​ తిరిగి అధికారంలోకి రావడం అబార్షన్​ హక్కులకు వినాశకరమైనదని సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.

తమ హక్కులను లాగేసుకున్నారని, ఫలితంగా పరుషులతో డేటింగ్​ చేయడానికి ఆందోళనగా ఉందని చాలా మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘4బీ’ ఉద్యమం అమెరికా వ్యాప్తంగా ఊపందుకుంది! ఈ ఉద్యమంలో తాము కూడా చేరుతున్నట్టు చాలా మంది మహిళలు సోషల్​ మీడియాలో చెబుతున్నారు. అసలు ఏంటి ఈ 4బీ ఉద్యమం? అమెరికన్​ మహిళలు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు?

4బి ఉద్యమం అంటే ఏమిటి?

పితృస్వామ్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు గత కొన్నేళ్లుగా, దక్షిణ కొరియా మహిళలు ఒక కొత్త విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. ఇకపై వ్యవస్థలో క్రియాశీల భాగస్వాములు కాబోమని తేల్చిచెప్పారు. రివెంజ్ పోర్న్, లింగ ఆధారిత హింస, ఫెమిసైడ్ వంటి సమస్యలకు ప్రతిస్పందనగా కొంతమంది దక్షిణ కొరియా మహిళలు రిలేషన్స్​కి దూరంగా ఉంటున్నారు. తమపై హింస ఆగకపోతే 4బీ ఉద్యమం వల్ల జననాల రేటు తగ్గుతుందని, ఫలితంగా జనాభా నెమ్మదిగా చచ్చిపోతుందని ఈ మహిళలు హెచ్చరిస్తున్నారు.

వాషింగ్టన్ పోస్ట్ తాజా నివేదిక ప్రకారం.. ఈ 4బీ ఉద్యమం వెనుక భావజాలం నాలుగు సాధారణ నియమాలపై ఆధారపడి ఉంది.

బియోనే: పురుషులతో డేటింగ్ లేదు

బిసెక్సు: పురుషులతో శృంగారం లేదు

బిహోన్: వివాహం లేదు

బిచుల్సన్ : పిల్లల పెంపకం లేదు

మహిళలపై అధిక హింసకు ప్రతిస్పందనగా 4బీ ఉద్యమం ప్రారంభమైంది. 2016లో సియోల్​లోని పబ్లిక్ బాత్రూమ్​లో ఓ యువతి హత్యకు గురైంది. మహిళలు పురుషులతో వ్యక్తిగత శృంగార సంబంధాలను నిలిపివేస్తామని ఎక్కువగా టిక్​టాక్​, ఇన్​స్టాగ్రామ్​లో ప్రతిజ్ఞ చేశారు.

అమెరికాలోని మహిళలు ఏమంటున్నారు?

మహిళల శరీరాలపై నిరంతం రాజకీయాలు జరుగుతున్నాయని, యూఎస్​లో గణనీయమైన మార్పును సృష్టించడానికి సాహసోపేతమైన 4బీ ఉద్యమం ఖచ్చితంగా అవసరం పడుతుందని మహిళలు భావిస్తున్నారు. దేశంలో లింగ అసమానతలపై పురుషులను పూర్తిగా బహిష్కరించాలని పలువురు మహిళలు ఇతరులను కోరుతున్నారు.

ఒకరిద్దరు మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి చాలా మంది మహిళలు మద్దతుపలుకుతున్నారు. అయితే ఇలాంటి ఉద్యమం అనూహ్య పరిణామాలకు దారి తీస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ‘మన సమాజ నిర్మాణంలో స్త్రీవివక్ష అనేది లోతుగా ముడిపడి ఉందని ట్రంప్ ఎన్నిక రుజువు చేసింది,’ అని అంటున్నారు.

“లేడీస్, విషయం చెప్పినప్పుడు నేను చాలా భయపడుతున్నాను (వాస్తవానికి), మీ గర్భాశయాలను మగవారి కోసం క్లోజ్​ చేసే సమయం ఆసన్నమైంది. వారు మనల్ని ద్వేషిస్తారని ఈ ఎన్నికలు.. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా రుజువు చేస్తున్నాయి. వారికి రివార్డులు ఇవ్వకండి,” అని పేర్కొన్నారు.

“4బీ ఉద్యమం అంటే ఏమిటని ఇప్పటికీ ఆలోచిస్తున్న వారికి డేటింగ్ లేదు, శృంగారం లేదు, పిల్లలు లేరు, పెళ్లి లేదు,” అని ఒకరు ట్వీట్ చేశారు.

-అంతర్జాల ద్వారా సేకరించిన సమాచారం

]]>
https://telugunewstimes.com/another-movement-in-america-women-who-say-no-to-sex-with-men/feed/ 0
ట్రంప్ గెలిచేశాడు.. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక https://telugunewstimes.com/trump-won-the-election-of-the-47th-president-of-the-united-states/ https://telugunewstimes.com/trump-won-the-election-of-the-47th-president-of-the-united-states/#respond Wed, 06 Nov 2024 08:44:41 +0000 https://telugunewstimes.com/?p=3267

తెలుగు న్యూస్ టైమ్స్ ప్రతినిధి:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్ గెలిచేశాడు.. కమలా హారిస్ ను చిత్తు చేసి.. రెండో సారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నాడు ట్రంప్.

అమెరికాకు 47వ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నాడు ట్రంప్.అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ 277 సీట్లలో విజయం సాధించగా.. కమలా హారిస్ 226 సీట్లలో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270. మొత్తం స్థానాలు 538.. ఇంకా 35 స్థానాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన రిజల్ట్స్ తోనే.. ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటి.. అదనంగా ఏడు స్థానాల్లో గెలుపొందాడు. ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్ పార్టీలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

గతం కంటే భిన్నంగా ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగాయి. రెండోసారి అధ్యక్ష పీఠంపై ఎలాగైనా కూర్చోవాలన్న కసితో ట్రంప్ చేసిన ప్రచారం ఎట్టకేలకు ఫలించింది. ట్రంప్ కు ధీటుగానే అధికార డెమోక్రటిక్ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ను కాదని.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిన్ ను అధ్యక్షురాలిగా బరిలోకి దింపింది డెమోక్రటిక్ పార్టీ.

కమలాహారిస్ వర్సెస్ ట్రంప్ మధ్య ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా వలసలు, ఫ్రీడం ఆఫ్ స్పీచ్, ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదల, ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు అమెరికా జోక్యం వంటి అంశాలను ప్రధానంగా ప్రచార అస్త్రాలు అయ్యాయి.

డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలోకి అక్రమ వలసలు భారీగా ఉన్నాయని.. దేశ భద్రతకు ఇది ముప్పు అనేది ట్రంప్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో ధరల పెరుగుదల అంశం కీలకంగా మారింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలు వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి.

ట్రంప్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని డెమోక్రటిక్ తరపున కమలాహారిస్ తీవ్రంగా తిప్పికొట్టినా.. మెజార్టీ ప్రజలు మాత్రం మళ్లీ ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ట్రంప్ వస్తేనే అన్ని సెట్ రైట్ అవుతాయని బలంగా భావించారు. అందుకు తగ్గట్టుగానే రిపబ్లికన్ పార్టీకి పట్టం కట్టారు.

]]>
https://telugunewstimes.com/trump-won-the-election-of-the-47th-president-of-the-united-states/feed/ 0
టీటీడీ బోర్డు ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకం, కొత్త సభ్యులు వీళ్లే https://telugunewstimes.com/appointment-of-br-naidu-as-chairman-of-ttd-board-these-are-the-new-members/ https://telugunewstimes.com/appointment-of-br-naidu-as-chairman-of-ttd-board-these-are-the-new-members/#respond Wed, 30 Oct 2024 15:05:31 +0000 https://telugunewstimes.com/?p=3193 అమరావతి న్యూస్ :టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీఆర్ నాయుడు ను చైర్మన్ గా నియమించారు. టీటీడీ సభ్యులుగా తెలంగాణ నుంచి ఐదుగురు,కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచిఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు

టీటీడీ సభ్యులు వీరే

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు, సభ్యులుగా పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి,ఆర్ఎన్, దర్శన్, జస్టిస్ హెచ్ఎల్ దత్,శాంతారాం, పి. రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకిదేవి, బి.మహేందర్ రెడ్డి, ఎం. రంగశ్రీ,బి. ఆనందసాయి, ఎల్ల.సుచిత్ర, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరబ్ హెచ్.బోరలను నియమించారు.
తెలంగాణ నుంచి నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్లకు చోటు కల్పించారు. కర్ణాటక నుంచి నరేష్ కుమార్, దర్శన్ ఆర్ఎన్, జస్టిస్ హెచ్ ఎల్ దత్, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి, డాక్టర్ అదిత్ దేశాయ్ గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి సౌరభ్ హెచ్ బోరాలకు అవకాశం దక్కింది.

బీఆర్ నాయుడు ప్రస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (72) నియమితులయ్యారు. టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి ఏదో సాధించాలన్న తపనతో కృషి చేసేవారు. స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చాలా చురుకుగా పనిచేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు.

బీఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఈఎల్ లోనే పనిచేశారు.బీహెచ్ఇఎల్ లో పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని బలంగా కోరుకున్నారు. ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించేందుకు జరిగిన ప్రయత్నాలను బీఆర్ నాయుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎంగా ఎన్టీఆర్ కొనసాగాలని కోరుతూ “ప్రజాస్వామ్య పునరుద్ధరణ” పేరున జరిగిన భారీ సభలు, ర్యాలీలు నిర్వహించిన సమయంలోనే బి.ఆర్ నాయుడు శక్తి వంచన లేకుండా చేసిన కృషితో చంద్రబాబుకు దగ్గరయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ స్థానికంగా ప్రజా ప్రతినిధిగా కూడా పనిచేశారు.

ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బీఆర్ నాయుడు అంచలంచలుగా ఎదుగుతూ తర్వాత టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఓ ప్రపంచ స్థాయి నగరం రాజధాని ఉండాలనే విధానాన్ని బలంగా సమర్ధించారు. అమరావతి రాజధాని కోసం బీఆర్ నాయుడు పోరాడారు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని సమర్ధించినందుకు వైసీపీ ప్రభుత్వం 70 ఏళ్ల వయసులో బీఆర్ నాయుడుపై రాజద్రోహం కేసులు పెట్టింది.

]]>
https://telugunewstimes.com/appointment-of-br-naidu-as-chairman-of-ttd-board-these-are-the-new-members/feed/ 0
100 మీటర్లు దూరంలో ఒడ్డుకు చేరేవారు ఇంతలోనే ప్రమాదం, 78 మంది ప్రాణాలు కోల్పోయారు… https://telugunewstimes.com/at-a-distance-of-100-meters-they-reached-the-shore/ https://telugunewstimes.com/at-a-distance-of-100-meters-they-reached-the-shore/#comments Sat, 05 Oct 2024 04:46:04 +0000 https://telugunewstimes.com/?p=2827

టీ నగర్ న్యూస్ :కాంగో (Congo) లో ఘోర పడవ ప్రమాదం (Boat accident) జరిగింది. దక్షిణ కివు (South Kivu) ప్రావిన్స్‌లోని మినోవా (Minova) పట్టణం నుంచి గోమా (Goma) పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్‌ లోడ్‌ (Over load) కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది.కివూ సరస్సు (Kivu lake) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు (Rescue teams) కాపాడాయి.
ఈ పడవ ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిలో కొందరు ఈదుతూ ఒడ్డుకు రాగా, కొందరిని రక్షణ దళాలు కాపాడాయని దక్షిణ కివు ప్రావిన్స్‌ గవర్నర్‌ జీన్‌ జాక్వెస్‌ పురుషి మీడియాకు తెలిపారు. అయితే మరణాలకు సంబంధించి కచ్చితమైన సంఖ్య తెలియడానికి మరో రెండు రోజులు పడుతుందన్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని, గల్లంతైన 78 మందిలో అందరి మృతదేహాలు లభ్యం కాలేదని అన్నారు.

కాంగో ప్రభుత్వ బలగాలకు, M23 తిరుగుబాటుదారులకు మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది. కాగా యుద్ధమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు మండిపడుతున్నారు.
]]>
https://telugunewstimes.com/at-a-distance-of-100-meters-they-reached-the-shore/feed/ 1