క్రైమ్ – telugu news times https://telugunewstimes.com తెలుగు న్యూస్ టైమ్స్ Sun, 08 Feb 2026 07:15:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://telugunewstimes.com/wp-content/uploads/2024/08/cropped-tnt-1-32x32.jpg క్రైమ్ – telugu news times https://telugunewstimes.com 32 32 భర్త నిర్లక్ష్యం.. అప్పుల భారం.. తల్లిని మింగేసిన వేదన – ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య https://telugunewstimes.com/husbands-neglect-the-burden-of-debt-and-the-anguish-that-consumed-her-a-married-woman-committed-suicide-along-with-her-two-young-children/ https://telugunewstimes.com/husbands-neglect-the-burden-of-debt-and-the-anguish-that-consumed-her-a-married-woman-committed-suicide-along-with-her-two-young-children/#respond Sun, 08 Feb 2026 07:14:55 +0000 https://telugunewstimes.com/?p=5473 తిరుపతి జిల్లా పుత్తూరులో శనివారం హృదయాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతలేని ప్రవర్తన, పెరుగుతున్న అప్పుల ఒత్తిడితో ఓ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు చిన్న కుమార్తెల ప్రాణాలు తీసిన ఆమె, అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఘటన వివరాలు:
నేషనూరుకు చెందిన పద్మ (28) మరియు శివశంకర్ (32) డిగ్రీ చదువుతున్న రోజుల్లో పరిచయమై ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అభ్యంతరాలను లెక్కచేయకుండా 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి తేజ (6), లాస్య (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెళ్లైన తర్వాత శివశంకర్ పనిపాటలేకుండా తిరుగుతూ, కుటుంబ బాధ్యతలను పూర్తిగా విస్మరించాడని స్థానికులు చెబుతున్నారు.
హృదయాన్ని కదిలించిన సూసైడ్ నోట్:
మరణానికి ముందు పద్మ రాసిన లేఖలో ఆమె అనుభవించిన బాధ స్పష్టంగా కనిపిస్తోంది.
“తల్లిదండ్రుల మాట కాదని పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక భర్తలో ఉండకూడని ప్రతి చెడు అలవాటు నాలోని భర్తలో ఉంది. నిన్ను ప్రేమించిన తప్పుకు నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పులు కూడా తీర్చలేనంటున్నావు. నా తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా… ఈసారి అయినా స్థిరపడిన తర్వాత చేసుకో” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అప్పుల ఒత్తిడే కారణం:
కుటుంబాన్ని నిలబెట్టేందుకు పద్మ డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు తీసుకుని ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు చెల్లించేది. శనివారం అప్పు చెల్లింపుల విషయమై భర్తను ప్రశ్నించగా, తన వల్ల కాదని అతడు తేల్చిచెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ పిల్లలను బెడ్‌రూమ్‌లో ఉరేసి, హాల్‌లో తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
పోలీసుల దర్యాప్తు:
సాయంత్రం ఇంటికి వచ్చిన శివశంకర్ తలుపులు పగలగొట్టగా ఈ దారుణం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న డీఎస్పీ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

]]>
https://telugunewstimes.com/husbands-neglect-the-burden-of-debt-and-the-anguish-that-consumed-her-a-married-woman-committed-suicide-along-with-her-two-young-children/feed/ 0
హైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన https://telugunewstimes.com/a-heartbreaking-incident-occurred-in-hyderabad/ https://telugunewstimes.com/a-heartbreaking-incident-occurred-in-hyderabad/#respond Tue, 03 Feb 2026 03:43:13 +0000 https://telugunewstimes.com/?p=5454 *రైలు కింద పడి తల్లి, ఇద్దరు పిల్లల మృతి

హైదరాబాద్ నగరం మరోసారి విషాదంలో మునిగిపోయింది. చర్లపల్లి–ఘట్‌కేసర్ మధ్య రైలుపట్టాలపై జరిగిన ఘటన నగరాన్ని కలచివేసింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటుచేసుకోవడంతో, ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా విషాద వాతావరణంలోకి వెళ్లిపోయింది.
శనివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో గూడ్స్ రైలు లోకో పైలట్ ట్రాక్‌పై మూడు మృతదేహాలను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, తల్లి మరియు ఆమె ఇద్దరు పిల్లలు అక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది.
మృతులను బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమారుడు విశాల్ రెడ్డి, కుమార్తె చేతన రెడ్డిగా గుర్తించారు. విశాల్, చేతన ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. జీవితంపై కలలు కనే వయసులోనే వారి ప్రాణాలు పోవడం విషాదాన్ని మరింత పెంచింది.
ఈ ఘటనకు ముందు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తల్లి ఇద్దరు పిల్లల చేతులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఫుటేజ్ చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది. సాధారణ కుటుంబంలా కనిపించిన ఆ నడక, చివరి ప్రయాణమని తెలిసి అందరినీ కలచివేస్తోంది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నిర్ణయానికి దారి తీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటన మరోసారి మానసిక ఒత్తిడి, ఒంటరితనం, సహాయం అందని పరిస్థితులపై సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ప్రాణాల విలువకు మించినది ఏదీ లేదని ఈ ఘటన మనకు హెచ్చరికగా నిలుస్తోంది. మౌనంగా ఉన్నవారిని పలకరించడం, బాధలో ఉన్నవారికి ధైర్యం ఇవ్వడం ఒక జీవితాన్ని కాపాడగలదన్న సందేశాన్ని ఈ విషాదం మన ముందుంచింది.


………

]]>
https://telugunewstimes.com/a-heartbreaking-incident-occurred-in-hyderabad/feed/ 0
అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి https://telugunewstimes.com/ajit-pawar-died-in-a-plane-crash/ https://telugunewstimes.com/ajit-pawar-died-in-a-plane-crash/#respond Wed, 28 Jan 2026 04:55:31 +0000 https://telugunewstimes.com/?p=5445 చెన్నై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైంది. పుణే జిల్లాలోని బారామతి ప్రాంతంలో ఉదయం 8:45 గంటల సమయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో విమానం కూలిపోయినట్లు సమాచారం.
విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన భద్రతా సిబ్బంది సహా మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. విమానం కూలిన అనంతరం అజిత్ పవార్‌ను సహాయక బృందాలు బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు తొలుత సమాచారం వెలువడింది.
అయితే, ఈ ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

]]>
https://telugunewstimes.com/ajit-pawar-died-in-a-plane-crash/feed/ 0
బారామతిలో ల్యాండింగ్ సమయంలో విమానంలో సాంకేతిక లోపం – అజిత్ పవార్ ప్రయాణంపై ఉత్కంఠ https://telugunewstimes.com/a-technical-malfunction-occurred-in-the-aircraft-during-landing-in-baramati-suspense-surrounds-ajit-pawars-journey/ https://telugunewstimes.com/a-technical-malfunction-occurred-in-the-aircraft-during-landing-in-baramati-suspense-surrounds-ajit-pawars-journey/#respond Wed, 28 Jan 2026 04:23:33 +0000 https://telugunewstimes.com/?p=5441 చెన్నై న్యూస్ :మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి బారామతి ప్రాంతంలో ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. ఈ ఘటన బారామతి నియోజకవర్గ పరిధిలోని గోజుబావి ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
విమానం భూమిపైకి దిగిన వెంటనే ఇంజిన్ భాగం నుంచి పొగలు ఎగసిపడటంతో అక్కడ క్షణాల పాటు ఆందోళన నెలకొంది. విమానంలో ఉన్న కొంతమంది స్వల్ప గాయాలకు గురైనట్లు సమాచారం. అయితే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఎలాంటి గాయాలు కాలేదా అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో బారామతిలో పర్యటన నిమిత్తం అజిత్ పవార్ అక్కడికి చేరుకున్నారని, ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని వర్గాలు చెబుతున్నాయి. బారామతి పవార్ కుటుంబానికి రాజకీయంగా కీలకమైన ప్రాంతం కావడం గమనార్హం.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు మరియు పోలీస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత స్పష్టత రానుంది. తాజా సమాచారం కోసం అప్డేట్స్‌ను గమనించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు

]]>
https://telugunewstimes.com/a-technical-malfunction-occurred-in-the-aircraft-during-landing-in-baramati-suspense-surrounds-ajit-pawars-journey/feed/ 0
ఫోన్‌పే పేరుతో పొంగల్ గిఫ్ట్ స్కామ్ – వినియోగదారులకు సైబర్ హెచ్చరిక https://telugunewstimes.com/pongal-gift-scam-in-the-name-of-a-popular-brand-cyber-warning-to-consumers/ https://telugunewstimes.com/pongal-gift-scam-in-the-name-of-a-popular-brand-cyber-warning-to-consumers/#respond Thu, 15 Jan 2026 17:34:21 +0000 https://telugunewstimes.com/?p=5348 చెన్నై న్యూస్:పొంగల్ పండుగను అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మరోసారి రంగంలోకి దిగారు. ‘ఫోన్‌పే గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరుతో రూ.5,000 క్యాష్ రివార్డ్ ఇస్తున్నామని చెబుతూ వాట్సాప్‌లో నకిలీ లింకులు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
ఆ లింక్‌పై క్లిక్ చేసిన కొంతమందికి వెబ్‌పేజీ ఓపెన్ కాకుండా 404 ఎర్రర్ కనిపిస్తుండగా, మరికొందరికి ఆ మెసేజ్‌ను 5 వాట్సాప్ గ్రూపులు లేదా 15 మంది స్నేహితులకు షేర్ చేయాలన్న సూచనలు వస్తున్నాయి. అలాగే “ఇది ఫేక్ అనుకున్నాను కానీ నిజంగా డబ్బులు వచ్చాయి” అంటూ ఆకర్షణీయమైన ఫేక్ టెస్టిమోనియల్స్ కూడా అందులో ఉంటున్నట్లు సైబర్ నిపుణులు వెల్లడించారు.
ఇలాంటి లింకులను ఓపెన్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు లీక్ కావడం, బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావడం, ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌పే సంస్థ నుంచి అధికారికంగా ప్రకటించని ఆఫర్లు పూర్తిగా నకిలీవేనని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ మెసేజ్ అందుకున్న వారు వెంటనే డిలీట్ చేయాలని, ఇతర గ్రూపులు లేదా స్నేహితులకు కూడా ఈ స్కామ్‌పై అవగాహన కల్పించాలని సైబర్ అధికారులు సూచిస్తున్నారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

]]>
https://telugunewstimes.com/pongal-gift-scam-in-the-name-of-a-popular-brand-cyber-warning-to-consumers/feed/ 0
కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు – https://telugunewstimes.com/supreme-courts-sensational-orders-on-karur-stampede/ https://telugunewstimes.com/supreme-courts-sensational-orders-on-karur-stampede/#respond Mon, 13 Oct 2025 08:45:56 +0000 https://telugunewstimes.com/?p=4806 *సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్, ప్రత్యేక కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ న్యూస్:దేశవ్యాప్తంగా కలకలం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ, దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వం వహించనున్నారు.

🔹 కమిటీ వివరాలు

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీలో తమిళనాడు కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు (ఐజీ స్థాయి లేదా అంతకంటే పై ర్యాంక్) సభ్యులుగా ఉంటారు. కమిటీకి సీబీఐ దర్యాప్తును పూర్తిగా పర్యవేక్షించే అధికారం ఉంటుంది. సాక్ష్యాలను సమీక్షించడం, అవసరమైన సూచనలు ఇవ్వడం వంటి అధికారాలు ఈ కమిటీకి ఉంటాయి.

🔹 విజయ్ పిటిషన్‌పై విచారణ

తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ ఈ ఘటనపై ముందుగా మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు స్పందనతో సంతృప్తి చెందని విజయ్, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు జీఎస్ మణి, అలాగే బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు.

🔹 సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ ఎన్.వి. అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

“ఇలాంటి ఘటనలు పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తాయి.”

“ఈ తొక్కిసలాట దేశాన్ని కదిలించింది, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం ఉంది.”

🔹 నేపథ్యం

గత సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలనే డిమాండ్‌తో పలు పిటిషన్లు కోర్టును ఆశ్రయించాయి.

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఈ కేసు దిశ పూర్తిగా మారిపోయింది. సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు త్వరలో ప్రారంభం కానుంది.

]]>
https://telugunewstimes.com/supreme-courts-sensational-orders-on-karur-stampede/feed/ 0
భరతన్ కుటుంబానికి మోటార్ వెలిచ్చం ఆపన్న హస్తం https://telugunewstimes.com/a-hand-that-turned-off-the-motor-light-for-bharatans-family/ https://telugunewstimes.com/a-hand-that-turned-off-the-motor-light-for-bharatans-family/#respond Tue, 30 Sep 2025 01:36:41 +0000 https://telugunewstimes.com/?p=4769 విల్లివాకం న్యూస్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భరతన్ కరుణానిధి కుటుంబానికి మోటార్ వెలిచం, ఆలిండియా మోటార్ సర్వీస్ ఆపన్న హస్తం అందించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఎంజెఎఫ్ లయన్ విజి జయకుమార్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ కలకత్తా సమీపాన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన డ్రైవర్ భరతన్ కరుణానిధి మృతి చెందారు.

అశోక్ కుమార్ గాయపడ్డారు. కలకత్తా టీం పిఆర్ఓ కార్తీక్ , పి నరసింహారావు,తన సూచనలకు అనుగుణంగా సహోదరుడు జయకుమార్, అరుణాచలం, మార్టిన్ 24 గంటల పాటు శ్రమించి భరతన్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకువచ్చి కుటుంబీకులకు అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశాము. లారీ ఓనర్ డ్రైవర్ మృతి గురించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాఉండగా, మోటార్ వెలిచ్చం సాయపడుతుందని జయకుమార్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో అందరం ఐక్యతగా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. భరతన్ కుటుంబానికి మోటార్ వెలిచం తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

…….

]]>
https://telugunewstimes.com/a-hand-that-turned-off-the-motor-light-for-bharatans-family/feed/ 0
కరూర్‌లో పెను విషాదం: విజయ్ ప్రచార తొక్కిసలాటలో 31 మంది మృతి? https://telugunewstimes.com/tragedy-31-people-killed-in-vijay-campaign-stampede/ https://telugunewstimes.com/tragedy-31-people-killed-in-vijay-campaign-stampede/#respond Sat, 27 Sep 2025 16:30:20 +0000 https://telugunewstimes.com/?p=4753 చెన్నై న్యూస్ :తమిళనాడు వెట్రి కలగం నాయకుడు విజయ్ ఈ రాత్రి కరూర్ జిల్లాలో ప్రజలను కలిసి ప్రసంగించారు. విజయ్ వ్యాన్ దగ్గర ఒక హింసాత్మక జనసమూహం గుమిగూడింది. ఫలితంగా, విజయ్ మాట్లాడుతుండగా ఒక మహిళ స్పృహ కోల్పోయింది. ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
విజయ్ మాట్లాడటం ముగించి వెళ్లిపోయిన తర్వాత, జనం చెల్లాచెదురుగా పడుతుండగా తొక్కిసలాట జరిగింది. 50 మందికి పైగా స్పృహ కోల్పోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు మరియు చికిత్స పొందుతున్నారు.

మొదట్లో వారిలో ఇద్దరు చికిత్స పొందకుండా మరణించారని వార్తలు వచ్చాయి. దీని తర్వాత ఆసుపత్రి నుండి వస్తున్న సమాచారం అందరినీ తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. దీని ప్రకారం, రెండవ దశలో, ఒక మహిళ మరియు 3 పిల్లలు సహా 10 మంది మరణించారని మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు.

స్పృహ కోల్పోయిన వారిని నిరంతరం ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు. వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ మరియు ఇతర అధికారులు కరూర్ ఆసుపత్రిలో క్షేత్రస్థాయి ప్రజలకు సహాయం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, విజయ్ ప్రసార తొక్కిసలాటలో 6 మంది పిల్లలు, 16 మంది మహిళలు సహా 31 మంది మరణించారని ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రానియన్ తెలిపారు. 58 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్‌లు క్యూలో ఉంచబడ్డాయి.
…………..

]]>
https://telugunewstimes.com/tragedy-31-people-killed-in-vijay-campaign-stampede/feed/ 0
ATM దోపిడీకి సినిమా స్టైల్లో ప్రయత్నం – ముఠా అరెస్టు https://telugunewstimes.com/mumbai-atm-police-nets-a-gang-of-robbers-who-tied-the-device-to-a-car/ https://telugunewstimes.com/mumbai-atm-police-nets-a-gang-of-robbers-who-tied-the-device-to-a-car/#respond Wed, 06 Aug 2025 04:20:47 +0000 https://telugunewstimes.com/?p=4664 ముంబై: ఛత్రపతి శంభాజీ నగర్‌లో ATM దోపిడీకి సినీ తరహాలో ప్రణాళిక రూపొందించిన దొంగల ముఠా పోలీసుల చేతిలో పట్టుబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ATMను కారుతో లాగేందుకు ప్రయత్నించిన ఈ ముఠా చివరకు తమ యత్నాల్లో విఫలమైంది.

షానుర్వాడి ప్రాంతంలోని ATM సెంటర్‌కి నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు ఒక కారులో వచ్చారు. ATM మెషీన్‌కు తాడు కట్టి, కారుతో లాగేందుకు ప్రయత్నించారు. అయితే యంత్రం కదలకపోవడంతో, వారు తమ ప్రణాళికను మార్చారు.

వెంటనే స్క్రూడ్రైవర్ వంటి సాధనాలతో ATMను పగలగొట్టి లోపల ఉన్న డబ్బు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఇందులో కూడా వారికి విజయం లభించలేదు. యంత్రాన్ని పగలగొట్టడంలో విఫలమవడంతో ముఠా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.

ఇంతలో ఉదయం డబ్బు తీసుకోవడానికి వచ్చిన ఓ కస్టమర్, ATM పగిలిపోవడం చూసి వెంటనే బ్యాంక్ అధికారులకు సమాచారం అందించాడు. వారు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు దళం సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించి పట్టుకుంది.
………

]]>
https://telugunewstimes.com/mumbai-atm-police-nets-a-gang-of-robbers-who-tied-the-device-to-a-car/feed/ 0
మదనపల్లిలో బుద్ధుని శిలా విగ్రహాన్ని ధ్వంసం చేసిన శక్తులను అరెస్టు చేయాలి! …. ఎంపి తిరుమావలవన్ https://telugunewstimes.com/the-forces-that-destroyed-the-buddha-statue-in-madanapalle-should-be-arrested-mp-thirumavalavan/ https://telugunewstimes.com/the-forces-that-destroyed-the-buddha-statue-in-madanapalle-should-be-arrested-mp-thirumavalavan/#respond Sun, 03 Aug 2025 14:17:42 +0000 https://telugunewstimes.com/?p=4655 విల్లివాకం న్యూస్: అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న కొండపై బుద్ధుని శిలా విగ్రహాన్ని ధ్వంసం చేసిన శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివారం చెన్నై విసికే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ తిరుమావలవన్ డిమాండ్ చేశారు. సుమారు 20 సంవత్సరాల నుండి మదనపల్లిలో బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ వీ.సీ.కే పార్టీ ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారని అతనిని రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది ఆ శిలా విగ్రహo తలను ధ్వంసం చేయడమే గాక ఈ చర్యను ప్రతిఘటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన శివప్రసాద్ పై అనేక సెక్షన్లపై మదనపల్లి , రాయచోటి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తిరుమావలవన్ అన్నారు. బుద్ధుని తలను విధ్వంసం చేసిన శక్తులను అరెస్టు చేయాలని, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పార్టీ అంతర్లీనంగా తెలుగుదేశం పార్టీ పై పెత్తనం చలాయిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఆగస్టు 23వ తేదీ విజయవాడలో విసికె పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్యకర్తలతో చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో తాను కూడా పాల్గొనబోతున్నట్టు తిరుమావలవన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసింగం, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వన్నియరసు, పిటిఎం శివప్రసాద్, యు. గణపతి తదితరులు పాల్గొన్నారు.

……………..

]]>
https://telugunewstimes.com/the-forces-that-destroyed-the-buddha-statue-in-madanapalle-should-be-arrested-mp-thirumavalavan/feed/ 0