ఇటీవల విడుదలైన "యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్" నివేదిక ప్రకారం, యువత sosial మీడియా ప్రభావానికి అధికంగా గురవుతోంది. ముఖ్యంగా, 14 నుంచి 16 సంవత్సరాల వయస్కులలో 79% నుంచి 82.5% మంది విద్యార్థులు రోజు ఎక్కువ సమయం సోషల్ మీడియా వేదికల్లోనే గడుపుతున్నారు.
వయస్సు వారీగా డేటా ఇలా ఉంది:
✅ 14 ఏళ్ల వయసులో – 79% మంది
✅ 15 ఏళ్ల వయసులో – 82% మంది
✅ 16 ఏళ్ల వయసులో – 82.5% మంది
అనేక మంది విద్యార్థులు ఈ ప్లాట్‌ఫామ్‌లను విద్య కోసం కాకుండా, ఇతర వినోదాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అధ్యయనం తేల్చింది. ఇది వారి పరీక్ష ఫలితాలపై, మానసిక ఆరోగ్యంపై, ఒకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి!
ఈ డిజిటల్ యుగంలో పిల్లలను సామాజిక మాధ్యమాల ప్రభావం నుండి ఎలా రక్షించుకోవాలి?
✔ సమయ పరిమితులు విధించాలి
✔ విద్య కోసం సాంకేతికతను ఉపయోగించేందుకు ప్రోత్సహించాలి
✔ సమయం విలువను గురించి అవగాహన కల్పించాలి
సోషల్ మీడియా వినియోగాన్ని సమతుల్యం చేయడం భవిష్యత్ తరాలకు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ ఆచరణలపై అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి.
మీరు మీ పిల్లలను గమనిస్తున్నారా?
(ఈ కథనాన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి & పిల్లల భవిష్యత్తును కాపాడండి!)
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com