Logo
Date of Publish : 26 June 2026, 7:38 am
Editor : CH. MUKUNDARAO

పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై కేంద్రానికి విజ్ఞప్తి

భారత పాస్‌పోర్ట్‌కు ఉన్న చట్టపరమైన, రాజ్యాంగపరమైన ప్రాముఖ్యతపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు.

ఆయన విడుదల చేసిన ప్రకటనలో, పాస్‌పోర్ట్‌ను కేవలం విదేశీ ప్రయాణ పత్రంగా మాత్రమే కాకుండా, భారత గణరాజ్యం తరఫున రాష్ట్రపతి అధికారంతో జారీ అయ్యే అధికారిక ప్రభుత్వ పత్రంగా గుర్తించాలని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌లో ఉండే "In the Name of the President of the Republic of India", "By Order of the President of the Republic of India", అలాగే "Nationality: Indian" వంటి నమోదులు దాని అధికారిక గుర్తింపును తెలియజేస్తాయని వివరించారు.

అయితే విదేశాలకు వెళ్లని అనేక మంది ప్రజలకు పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతపై పూర్తి అవగాహన లేదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం దీనిపై అధికారిక వివరణ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే పాస్‌పోర్ట్‌లోని రాష్ట్రపతి పేరుతో ఉన్న ప్రకటనల అర్థం, "Nationality: Indian" అనే నమోదుకు ఉన్న ప్రాముఖ్యత, అలాగే భారత రాజ్యాంగం ప్రకారం జాతీయత (Nationality), పౌరసత్వం (Citizenship) మధ్య ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇది రాజకీయ అంశం కాదని, ప్రతి భారతీయుడికి సంబంధించిన రాజ్యాంగ అవగాహన మరియు దేశ గౌరవానికి సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు.


All Rights Reserved By telugunewstimes
Print Save