చెన్నై న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు నేడు చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
సందర్శన సందర్భంగా స్మారక మందిరానికి సంబంధించిన వివరాలను మంత్రి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పరిశీలించి, అందులో ఉన్న సాహిత్య సంపదను చూసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్మారక మందిర నిర్వహణకు సంబంధించి నిధుల కొరత ఉన్న విషయాన్ని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. ప్రభుత్వ సహకారం అందించి మందిరం సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వూరా శశికళ, సభ్యురాలు డాక్టర్ ఏ.వి. శివకుమారి కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
