
అమరావతి న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాల వర్గీకరణ కోసం నియమించిన ఏక సభ్య కమిషన్, జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, ఇటీవల తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించి, తగిన సూచనలు, సలహాలు అందించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రుల కమిటీ సభ్యులు:
డోల బలవీరాంజనేయ స్వామి
వంగాలపూడి అనిత
బిసి. జనార్దన్ రెడ్డి
నాదెండ్ల మనోహర్
సత్యకుమార్ యాదవ్
ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేసి, ఎస్సీ వర్గీకరణ అంశంపై కీలక సూచనలు ఇవ్వనుంది. ప్రభుత్వ నిర్ణయం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో కీలక మైలురాయిగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.