టీ నగర్ న్యూస్: శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నై ,ఆంజనేయ నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారిని పలు రకాల పుష్పాలు, పండ్లు తో అలంకరించారు.
మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో గ్రామంలోని ప్రధాన వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ నిర్వాహక కమిటీ పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com