Logo
Date of Publish : 18 July 2024, 9:09 am
Editor : CH. MUKUNDARAO

ఏపీలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు

తొలి విడత సీట్ల కేటాయింపు

ఏపీలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత సీట్ల కేటాయింపు పక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇటీవల తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించిన అధికారులు బుధవారం మొదటి రౌండ్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను వెల్లడిరచారు. ఈ మేరకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం.. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు 17`22లోపు చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.


All Rights Reserved By telugunewstimes
Print Save