Logo
Date of Publish : 01 July 2024, 7:16 pm
Editor : CH. MUKUNDARAO

ఇచ్చిన మాట ప్రకారం 7 వేల రూపాయలు పింఛన్‌ లబ్ధిదారులకు అందజేత

పిఠాపురం,  జూలై 01 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కళ్యాణ్‌ల ఆదేశానుసారం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో లబ్ధిదారులకు నేరుగా వాళ్ల ఇంటికే పింఛన్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రాడ గ్రామంలో సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్లు గత మూడు నెలల వెయ్యి రూపాయలు చొప్పున కలుపుకుని 3000 రూపాయల కలిపి మొత్తంగా 7000 రూపాయలను పిఠాపురం మండలం చిత్రాడ గ్రామ పంచాయతీలో సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కళ్యాణ్‌లకు నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ గ్రామ జనసేన పార్టీ నాయకులు, జనసేన సైనికులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఆయా పించనుదారులకు పింఛన్‌ 7,000 రూపాయలను పంపిణీ చేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save