టీమిండియా నూతన హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని నియమించింది బీసీసీఐ. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్, 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ నెలాఖరున జరిగే శ్రీలంక టూర్ నుంచి గౌతమ్ గంభీర్, టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు.. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ వ్యవహరించారు. వీరి కాంట్రాక్ట్ గడువు కూడా ముగిసింది. త్వరలోనే వీరి స్థానాలను కూడా భర్తీ చేయడానికి బీసీసీఐ దరఖాస్తులు కోరనుంది.. వీరిలో విక్రమ్ రాథోడ్, అంతకుముందు రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్నప్పటి నుంచి బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే తనకు కోచింగ్ స్టాఫ్‌లో కూడా పూర్తిగా కొత్త టీమ్ కావాలని గౌతమ్ గంభీర్, బీసీసీఐని కోరినట్టు సమాచారం.. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న అభిషేక్ నాయర్‌ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ పొజిషన్ కోసం సిఫారసు చేశాడట గౌతమ్ గంభీర్. అలాగే కేకేఆర్‌కి ఆడిన బౌలర్ వినయ్ కుమార్‌ని బౌలింగ్ కోచ్‌గా, సౌతాఫ్రికా ఫీల్డింగ్ లెజెండ్ జాంటీ రోడ్స్‌ని ఫీల్డింగ్ కోచ్‌గా నియమించాల్సిందిగా బీసీసీఐని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో తనతో పాటు పనిచేసిన పరాస్ మాంబ్రేని బౌలింగ్ కోచ్‌గా పట్టుకొచ్చాడు. అలాగే ఈసారి గౌతమ్ గంభీర్ కూడా తన టీమ్‌తో కోచింగ్ స్టాఫ్‌ని నింపబోతున్నాడు. బీసీసీఐ మాత్రం బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.. శ్రీలంక టూర్‌తో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే గౌతమ్ గంభీర్, 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ ఆ బాధ్యతలు కొనసాగబోతున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025, 2026 టీ20 వరల్డ్ కప్, 2027 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2027 వన్డే వరల్డ్ కప్.. ఇలా గౌతమ్ గంభీర్‌కి చాలా పెద్ద టార్గెట్లే ఇచ్చింది బీసీసీఐ..
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com