Logo
Date of Publish : 13 July 2025, 9:02 am
Editor : CH. MUKUNDARAO

తిరువళ్లూరులో గూడ్స్ రైలు అగ్ని ప్రమాదం – మూడు వ్యాగన్లు పట్టాలు తప్పి మంటలు

తిరువల్లూరు న్యూస్:తిరువళ్లూరు సమీపంలో ఇంధనాన్ని తరలిస్తున్న గూడ్స్ రైలులో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగతో చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా కమ్మబడింది. సమాచారం అందుకున్న వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించారు.

చెన్నై సెంట్రల్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వ్యాగన్లలో ఇంధన లీకేజ్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో మూడు వ్యాగన్లు పట్టాలు తప్పగా, మంటలు ఐదు వ్యాగన్ల వరకూ వ్యాపించాయి. అయినప్పటికీ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో మైసూర్ వందే భారత్, శతాబ్ది, కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ సహా పలువురు రైళ్లు నిలిపివేయబడ్డాయి. అరక్కోణం దారి మీదుగా వస్తున్న రైళ్లు మధ్యలోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. మంగళూరు నుండి చెన్నైకి వచ్చే చెన్నై మెయిల్ కూడా తిరువళ్లూరులోనే నిలిపివేశారు.

దక్షిణ రైల్వే ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై విచారణ చేపట్టింది. ప్రమాదం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించే ప్రధాన మార్గానికి తాకిడి ఇవ్వకపోయినా, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


All Rights Reserved By telugunewstimes
Print Save