Logo
Date of Publish : 28 June 2025, 8:49 am
Editor : CH. MUKUNDARAO

రాణిపేట్‌లో పెను ప్రమాదం తప్పింది: పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు

ఆరక్కోణం న్యూస్:రాణిపేట్ జిల్లాలోని చిత్తేరి రైల్వే స్టేషన్‌ వద్ద ఈ రోజు ఉదయం ఆరక్కోణం-కాట్పాడి మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలు (నెం. 66057) పట్టాలు తప్పింది. చిత్తేరి నుంచి రైలు బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే గాడిలో తేడా వచ్చినట్లు భావించబడుతున్న భారీ శబ్దం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్‌ అత్యవసరంగా బ్రేకులు వేయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న రైల్వే అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన కారణంగా అదే మార్గంలో నడిచే పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

రైల్వే ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రయాణికులకు కొన్ని అసౌకర్యాలు తప్పకపోవచ్చు. అప్రమత్తంగా వ్యవహరించిన లోకో పైలెట్‌కు ప్రయాణికులు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.


All Rights Reserved By telugunewstimes
Print Save