Logo
Date of Publish : 30 September 2025, 7:06 am
Editor : CH. MUKUNDARAO

భరతన్ కుటుంబానికి మోటార్ వెలిచ్చం ఆపన్న హస్తం

విల్లివాకం న్యూస్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భరతన్ కరుణానిధి కుటుంబానికి మోటార్ వెలిచం, ఆలిండియా మోటార్ సర్వీస్ ఆపన్న హస్తం అందించినట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఎంజెఎఫ్ లయన్ విజి జయకుమార్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ కలకత్తా సమీపాన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన డ్రైవర్ భరతన్ కరుణానిధి మృతి చెందారు.

అశోక్ కుమార్ గాయపడ్డారు. కలకత్తా టీం పిఆర్ఓ కార్తీక్ , పి నరసింహారావు,తన సూచనలకు అనుగుణంగా సహోదరుడు జయకుమార్, అరుణాచలం, మార్టిన్ 24 గంటల పాటు శ్రమించి భరతన్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకువచ్చి కుటుంబీకులకు అప్పగించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశాము. లారీ ఓనర్ డ్రైవర్ మృతి గురించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాఉండగా, మోటార్ వెలిచ్చం సాయపడుతుందని జయకుమార్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో అందరం ఐక్యతగా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. భరతన్ కుటుంబానికి మోటార్ వెలిచం తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

.......


All Rights Reserved By telugunewstimes
Print Save