గుమ్మడి పూండి న్యూస్: యువత సాంఘిక ఆధ్యాత్మిక అభివృద్ధి సంస్థ ( యువత ట్రస్ట్) 2025 వ సంవత్సర తెలుగు క్యాలెండర్ ను సోమవారం ఉదయం గుమ్మిడి పూండి సమీపంలోని పాపన్న కుప్పం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కంపెనీలో క్యాలెండర్ ముద్రణ దాత, ప్రముఖ పారిశ్రామికవేత్త తోటకృష్ణ ను శాలువా, చందనం మాలతో సత్కరించి యువత క్యాలెండర్ ను యువత సంస్ధ అధ్యక్షులు సిహెచ్ ముకుందరావు అందజేశారు. గత మూడేళ్లగా యువత తెలుగు క్యాలెండర్ ముద్రణకు సహకరించి మమ్ములను ముందుకు నడిపిస్తున్న తోట కృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాత తోట కృష్ణ మాట్లాడుతూ… యువత ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు, తన వంతు ఎప్పుడు సహకరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు వికాస సమితి ప్రధాన కార్యదర్శి వెలుగుల కృష్ణమోహన్, శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి నటరాజ్, కంపెనీ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.