
సామర్లకోట, జూన్ 28 : అంధ్రాయూనివర్సీటీ నిర్వహించిన ఎపి పిజి సెట్ నందు పరీక్షా ఫలితాల్లో సామర్లకోట మండల కొప్పవరం గ్రామానికి చెందిన కుమ్మరి నితిన్ సాగర్ రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ డేటా సైన్స్ చదివాడు. తండ్రి బుల్లిబాబు, తల్లి దుర్గాభవాని సహకారం, అధ్యాపకుల ప్రోత్సహంతో చదివి ర్యాంకు సాధించనని నితిన్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలులువురు అభినందించి, ప్రసంశలు కురిపించారు.