
విల్లివాకం న్యూస్: బహుముఖ ప్రజ్ఞాశాలి, సమాజ సేవా పరాయణుడు గూడపాటి జగన్మోహనరావు 81వ జన్మదిన సంబరాలు అంగరంగ వైభవంగా ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆధ్యాత్మిక సంపూర్ణ వాతావరణంలో ప్రముఖుల సమక్షమున కొరటూరు అగ్రహారం నందలి ఆంధ్ర కళా స్రవంతి యాజమాన్యమున దేదీప్యమానంగా విరాజిల్లు కోదండ రామాలయ ప్రాంగణమున రాములవారి అశేష దీవెనలతో జరగడం ప్రగాఢ శోభను సంతరించుకున్నది. గూడపాటి జగన్మోహనరావు, ధర్మపత్ని భువనేశ్వరి సమేతంగా ఉద్దండ పండితులు ఆధ్యాత్మిక దురందరులు సుసర్ల కుటుంబ శాస్త్రి శాస్త్రీయ మంత్రోచ్ఛరణలతో ఎంతో ఘనంగా జరిగింది.
ఆబాల గోపాలం ఆస్వాదించి దంపతులు ఇరువురిని అక్షంతలతో దీవెనలు అందించడం, స్వీకరించడం యధాతధంగా కొనసాగి ఆహ్లాదకరమైన నేపథ్యం సంతరించుకున్నది. లలిత గీతాంజలి అధినేత ఎం.ఆర్ సుబ్రహ్మణ్యం, వసుంధర విజయ సారథి ఇరువురిచే భక్తి పాటలు, భగవద్గీత శ్లోకములతో అలవోకగా గాత్ర కచేరి సభికులను ఆనంద డోలికలలో ముంచెత్తింది. విచ్చేసిన అందరికీ గూడపాటి జగన్మోహనరావు సతీమణి భువనేశ్వరి మిక్కిలి సౌందర్యవంతమైన వెండి ఏడుకొండల వెంకటేశ్వరుని ప్రతిమతో కూడిన జ్ఞాపికను బహుకరించిరి. మధ్యాహ్నం అందరికీ షడ్రుచులతో కూడిన ఆంధ్ర భోజనాన్ని వితరణ గావించారు.
ఆంధ్ర కళా స్రవంతి, చెన్నై తెలుగు అసోసియేషన్, కాపు సేవా సమితి సభ్యులు, బంధుమిత్రులు అనేక అనేకమంది రావడం, దీవెనలను అందించడం ముదావహం. పి ఆర్ కేశవులు అత్యంత బాధ్యతలతో సంబరాలను నిర్వహించిరి.
…………………