
న్యూఢిల్లీ ప్రతినిధి:ఆన్‌లైన్ లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతోంది. ఇటువంటి అనర్థాలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ చట్ట ప్రకారం, చట్టబద్ధమైన ఆర్థిక సంస్థల ద్వారా కాకుండా భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పులు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముసాయిదా ప్రకారం:
10 ఏళ్ల వరకు జైలు శిక్ష
రూ. కోటి వరకు భారీ జరిమానా
అనధికారికంగా అప్పులు ఇచ్చే వారిని కఠినంగా శిక్షించేందుకు ఇది కీలకమయ్యే అవకాశం ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే బంధువుల మధ్య స్వయంగా ఇచ్చే రుణాలను మినహాయించి, వడ్డీ వ్యాపారులు, అక్రమ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు ఇవ్వడం ఇకపై అసాధ్యమవుతుంది.
ఆత్మహత్యల పెరుగుదలపై చింతన
ఇటీవల దేశవ్యాప్తంగా అనధికారిక లోన్ యాప్‌ల కారణంగా ఎంతో మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గించాల్సిన రుణాలు, అధిక వడ్డీలతో పాటు వేధింపుల కారణంగా ప్రజల జీవనాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి.
పిల్లాల రక్షణ కోసం కీలక అడుగు
కేంద్రం తీసుకువచ్చే ఈ చట్టం కేవలం ఆర్థిక విధానాలకు మాత్రమే కాకుండా సామాజిక రక్షణకు కూడా దోహదం చేస్తుంది. లోన్ యాప్‌లకు సముచిత నియంత్రణ ఉంటే, ప్రజలు మరింత భద్రంగా ఉండగలరు.
ఈ చట్టం త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడే అవకాశం ఉంది. అమలయ్యాక ఇది ఆర్థిక రంగంలో నూతన అధ్యాయానికి నాంది అవుతుందని అంచనా.
……………..