Search
Close this search box.

ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

చెన్నై, న్యూస్: తెలుగు భాషా పరిరక్షణ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ వేడుక చెన్నై కొరట్టూరు అగ్రహారంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె. ఎం. నాయుడు అధ్యక్షత వహించారు. ఆంధ్ర కళా స్రవంతి కార్యదర్శి జె. శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు పి. సరస్వతి, కార్యనిర్వాహక సభ్యులు ఓ. మనోహరన్, ఈ. బాలాజీ, ఆలయ కమిటీ సభ్యురాలు జె. రాధిక తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం తెలుగు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జె. ఎం. నాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆంధ్ర కళా స్రవంతి తరఫున క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నామని, 2025 క్యాలెండర్‌ను కూడా అదే ఉద్దేశంతో విడుదల చేసినట్లు తెలిపారు. నగరంలోని తెలుగు వారందరికీ ఈ క్యాలెండర్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర కళా స్రవంతి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250112-WA0035
శ్రీ ఆంధ్ర కళా స్రవంతిలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
IMG-20250111-WA0007
ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 2025 తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
images (18)
సంక్రాంతి సందడి vs. పోలీసుల ఉక్కుపాదం: కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధం
n6468214411736364899870432362a80cd6245c59db05f71be6b2a79e71392eea0f2c632b329a9c30d7af23
తిరుపతి వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనంలో తొక్కిసలాట: ఆరుగురు మృతి, అనేక మంది గాయాలు
IMG-20250108-WA0022
తెలుగు పాలకులు తమిళనాడు సీఎం స్టాలిన్ నుంచి నేర్చుకోవాల్సిన చరిత్ర పాఠం: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి