చెన్నై న్యూస్ :శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 141 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. విమానం బయలుదేరినప్పుడు, దాని చక్రాలు ముడుచుకుంటాయి. అయితే ఈ విమానం చక్రాలు లోపలికి వెళ్లలేదు. దీంతో మళ్లీ తిరుచ్చి విమానాశ్రయంలో దింపాలని నిర్ణయించారు.
విమానంలో ఇంధనం అయిపోయేంత వరకు చక్కర్లు కొట్టి ఆ తర్వాత ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. దీంతో విమానం నిరంతరం ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉంది. మరోవైపు ముందుజాగ్రత్త చర్యగా తిరుచ్చి విమానాశ్రయంలో 10కి పైగా అంబులెన్సులు, 4 ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు.
తిరుచ్చి, పుదుకోట్టై తదితర ప్రాంతాల్లో 2 గంటలకు పైగా విమానం 26 సార్లు చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో రాత్రి 8.15 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న 144 మంది ప్రాణాలను కాపాడిన పైలట్లపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పైలట్ ఇక్రమ్ రిబాత్లీ, కో-పైలట్లు మైత్రి శ్రీకృష్ణ, లైష్రామ్ సంజితా దేవి, వైష్ణవి సునీల్ నింబాల్కర్, సుషీ సింగ్, సాకేత్ దిలీప్ వదనలతో కూడిన సిబ్బంది ప్రయాణికులకు భయం లేకుండా తమలో తాము మాట్లాడుకుని ప్లాన్ చేసి విమానాన్ని సురక్షితంగా దించారు. దాదాపు 2 గంటలకు పైగా ఆకాశంలో చక్కర్లు కొట్టిన తర్వాత కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉన్న పైలట్ల సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని దించారు.విమానం ల్యాండ్ కాగానే తిరుచ్చి విమానాశ్రయంలో గుమికూడిన ప్రయాణికులు, ప్రయాణికుల బంధువులు చప్పట్లు కొడుతూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. అలాగే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్ల బృందాన్ని సోషల్ మీడియాలో పలువురు కొనియాడుతున్నారు.
.........
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com